క్రైమ్ మిర్రర్, సినిమా :- టాలీవుడ్ నటి మృణాళిని రవి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా నిశ్చితార్థం చేసుకుని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.పుదుచ్చేరికి చెందిన మృణాళిని రవి బెంగళూరులో బీటెక్ పూర్తి చేసి ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి డబ్‌స్మాష్, టిక్‌టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన దర్శకులు సినీ అవకాశాలు ఇవ్వడంతో వెండితెరపై అడుగుపెట్టారు.
తమిళ చిత్రం సూపర్ డీలక్స్‌లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి వచ్చిన మృణాళిని, దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో బుజ్జమ్మ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించారు. అనంతరం తమిళంలో ఛాంపియన్, ఎనిమీ, ఎంజీఆర్ మగన్, జాంగో, కోబ్రా వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర చిత్రాల్లో కనిపించారు. చివరిసారిగా విజయ్ ఆంటోనీ సరసన రోమియో చిత్రంలో నటించారు.గత రెండేళ్లుగా కొత్త సినిమాలకు దూరంగా ఉన్న మృణాళిని ఆధ్యాత్మిక యాత్రలు, వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో మాత్రం తరచూ తన ఫోటోలు, ప్రయాణాలకు సంబంధించిన అప్డేట్లు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.
కుల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు మృతి
తాజాగా నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటిస్తూ తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉంగరాలతో ఉన్న చేతులను చూపిస్తూ చేసిన ఈ పోస్ట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మృణాళిని రవి కాబోయే భర్త పేరు మహావిష్ణు. ఆయన మలేషియాలో ఆధ్యాత్మిక గురువుగా సేవలందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరికీ దాదాపు ఏడేళ్లుగా పరిచయం ఉండగా, ఆ స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమ్మతితో ఈ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం.అయితే వివాహ తేదీ, వేదిక వంటి వివరాలను మృణాళిని ఇంకా వెల్లడించలేదు. ఆమె నిశ్చితార్థం సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తారా లేదా అనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు.
కాక్‌టెయిల్ 2 ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. రష్మిక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
