Homeతెలంగాణవైభవంగా శ్రీ నీలకంఠ రామస్వామి రథోత్సవం

వైభవంగా శ్రీ నీలకంఠ రామస్వామి రథోత్సవం

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): ​మర్రిగూడ మండలంలోని శివన్నగూడ(చర్లగూడ) గ్రామంలో వెలసిన శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలను మంగళవారం అత్యంత వైభ‌వంగా  నిర్వ‌హించారు. ఆలయ కమిటీ చైర్మన్ శిరిప్రగడ ఆనందరావు, గ్రామ సర్పంచ్ రాపోలు యాదగిరి ఆధ్వర్యంలో స్వామి వారి ర‌థోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు.

మంగ‌ళ వాయిద్యాల మ‌ధ్య స్వామి వారు ర‌థంపై ఊరేగుతూ భ‌క్త‌లకు ద‌ర్శ‌న‌మిచ్చారు. కాగా వేడుకులకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. దేవాదాయ శాఖ జిల్లా ఎగ్జిక్యూటివ్ అధికారి, జయరామయ్య ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించారు. సర్పంచ్ రాపోలు యాదగిరి భక్తుల సౌకర్యార్థం,అన్నప్రసాద (పులిహోర)వితరణ చేపట్టారు.

​ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సిరిప్రగడ వినోద రావు, రవీందర్ రావు, రాజేందర్ రావు, మహేందర్ రావు, రాహుల్, శ్రీధర్ రావు, సుధీర్ రావు, గోపాల్‌తో పాటు, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, మాల్ మార్కెట్ ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ యాదయ్య, ఉప సర్పంచ్ జంగిలి శాంతమ్మ మల్లయ్య, ఆలయ కమిటీ సభ్యులు చిట్యాల యాదగిరి రెడ్డి, నున్నగోపుల పెద్దులు, మంచికంటి శ్రీకాంత్, మాదగోని సత్తయ్య, ఐతగోని ఆంజనేయులు, లపంగి యాదమ్మ, మాదగోని హరికృష్ణ గౌడ్, మాదగోని శ్రీనివాస్, ఊరిపక్క మహేందర్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు