Homeవైరల్Sreemukhi Remuneration: శ్రీముఖి సంపాదన తెలిస్తే షాక్ అవడం ఖాయం...!

Sreemukhi Remuneration: శ్రీముఖి సంపాదన తెలిస్తే షాక్ అవడం ఖాయం…!

Crime Mirror,Cinema Updates: తెలుగు బుల్లితెరపై యాంకరింగ్‌కు కొత్త ఎనర్జీ తీసుకొచ్చిన పేరు శ్రీముఖి. తన చలాకీతనం, టైమింగ్, అందంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ స్టార్ యాంకర్ ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ప్రముఖుల్లో ఒకరిగా నిలిచింది.

యాంకర్‌గా మాత్రమే కాకుండా నటి, ఈవెంట్ హోస్ట్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఇప్పుడు వెండితెరపై కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమాలో కీలక పాత్ర పోషించడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.

Also Read: రైళ్లు లేవు… పరీక్షలు ఉన్నాయి!

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మా ఇంటి బంగారం చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సమంతకు తోడికోడలిగా శ్రీముఖి కనిపించనుందని సమాచారం. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో పాటు, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకురాలు పాత్రను డిజైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

గ్లామర్‌లో టాప్.. మాటల్లో తోపు.. !

ఇక పారితోషికం విషయానికి వస్తే, టెలివిజన్ రంగంలో శ్రీముఖి డిమాండ్ చాలా ఎక్కువ. రియాలిటీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ షోల కోసం ఒక్కో ఎపిసోడ్‌కు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుంటుందని ఇండస్ట్రీ టాక్. పండుగ స్పెషల్ ఈవెంట్లు, భారీ టెలివిజన్ కార్యక్రమాలకు అయితే ఈ మొత్తం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, సినీ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఒక్కో కార్యక్రమానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట. దసరా, సంక్రాంతి, దీపావళి వంటి ప్రత్యేక షోలకు ఆమె రెమ్యునరేషన్ రూ.4 లక్షల వరకు చేరుతుందని సమాచారం.

Also Read: విశాఖలో మహేష్ బాబు సందడి…!

బిగ్ బాస్ తెలుగు సీజన్-3లో పాల్గొన్నప్పుడు కూడా శ్రీముఖి అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది. 105 రోజుల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె, ఆ షో ద్వారా సుమారు రూ.1 కోటి వరకు సంపాదించిందనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది.

టెలివిజన్‌తో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా శ్రీముఖి భారీగా ఆదాయం ఆర్జిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల ఫాలోవర్లు ఉండటంతో బ్రాండ్ ప్రమోషన్స్, కమర్షియల్ ప్రకటనల ద్వారా మంచి ఆదాయం పొందుతోంది. అంతేకాదు, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ‘పుర్సత్’ పేరుతో రెస్టారెంట్‌ను కూడా నిర్వహిస్తోంది.

Also Read: కాంగ్రెస్ మాట‌తప్ప‌డంపై తీవ్ర నిరాశ‌లో ష‌ర్మిళా…?

బుల్లితెర స్టార్‌గా మొదలైన శ్రీముఖి ప్రయాణం ఇప్పుడు వెండితెర వరకు విస్తరించింది. మా ఇంటి బంగారం వంటి ప్రతిష్టాత్మక సినిమాలో సమంతతో కలిసి నటించడం ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా మారింది. ప్రస్తుతం యాంకర్‌గా, నటిగా, వ్యాపారవేత్తగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న శ్రీముఖి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

Also Read: Yogi Adityanath: అఖిలేష్ కుమార్తెపై ట్రోలింగ్.. సీఎం యోగి సీరియస్!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు