Homeవైరల్బాలయ్య కొత్త సినిమా.. సీఎం చంద్రబాబు క్లాప్...!

బాలయ్య కొత్త సినిమా.. సీఎం చంద్రబాబు క్లాప్…!

Crime Mirror, Cinema Updates: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో కెరీర్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రతి సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్న బాలయ్య, ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దేవర చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు కొరటాల శివతో బాలకృష్ణ చేయబోతున్న కొత్త సినిమా (NBK112) తాజాగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Sreemukhi Remuneration: శ్రీముఖి సంపాదన తెలిస్తే షాక్ అవడం ఖాయం…!

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను జూన్ 25న అధికారికంగా ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని వెంకటాయపాలెం టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరగనుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ లాంచ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు సమాచారం. ముహూర్తపు షాట్‌కు సీఎం చంద్రబాబు క్లాప్ కొట్టనుండగా, నారా లోకేష్ స్క్రిప్ట్‌ను దర్శకుడు కొరటాల శివకు అందించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కార్యక్రమంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Also Read: మహిళల భద్రత సమాజందే

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన సోషల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సమాజానికి సందేశం ఇచ్చే కథలను కమర్షియల్ ఫార్మాట్‌లో చూపించడంలో కొరటాల శివకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడి చేతిలో బాలయ్య వంటి మాస్ హీరో పడితే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తుండగా, హీరోయిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ వివరాలను జూన్ 25న జరిగే పూజా కార్యక్రమంలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

బాలకృష్ణ-కొరటాల శివ కలయికలో తెరకెక్కబోయే ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అమరావతి వేదికగా ప్రారంభం కానున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: ప్రభాస్ హీరోయిన్ కొత్త ప్రేమకథ…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు