Homeసినిమారామ్ చరణ్‌ ను చూస్తే తమ్ముడు గుర్తొస్తారు…శివ రాజ్‌కుమార్ ఎమోషనల్

రామ్ చరణ్‌ ను చూస్తే తమ్ముడు గుర్తొస్తారు…శివ రాజ్‌కుమార్ ఎమోషనల్

పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి ఆయన చెప్పిన మాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్వ్యూలో మాట్లాడిన శివ రాజ్‌కుమార్.. రామ్ చరణ్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎంతో ఎమోషనల్‌గా పంచుకున్నారు. రామ్ చరణ్‌ను చూస్తుంటే తనకు చాలా దగ్గరైన వ్యక్తిని చూసినట్టుగా అనిపించిందని, ఆయనలో ప్రేమతో పాటు వినయం స్పష్టంగా కనిపించాయని తెలిపారు.

అంతేకాదు.. చరణ్‌ను చూసిన ప్రతీసారి తన తమ్ముడు అప్పూ గుర్తొచ్చేవాడని చెప్పారు. ఆయనలో అదే ఎనర్జీ, అదే అమాయకత్వం కనిపించాయని, ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగంగా వెల్లడించారు. ఇంకా పెద్ది సినిమాలో రామ్ చరణ్ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి కూడా శివ రాజ్‌కుమార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పాత్ర కోసం చరణ్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోందని, ఈ సినిమా ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు.

చరణ్ ఈ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో దగ్గరగా చూశానని, ఆయన డెడికేషన్ చూస్తే నిజంగా గర్వంగా అనిపించిందని శివ రాజ్‌కుమార్ చెప్పిన మాటలు ఇప్పుడు మెగా అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ఇప్పుడు శివ రాజ్‌కుమార్ లాంటి స్టార్ నుంచి వచ్చిన ఈ ఎమోషనల్ కామెంట్స్ మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇద్దరు స్టార్‌ల మధ్య ఉన్న బాండింగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి …

  1. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్..సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన సినిమా తెలుసా!

  2. పెద్ది టీమ్‌కు మద్రాస్ హైకోర్టు భారీ ఊరట..!

  3. భగీరథకు వంశీ ఎన్.టి.ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు…!

  4. దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ రిలీజ్…!

  5. అప్పుడు చిరు-శ్రీదేవి-కమల్.. ఇప్పుడు చరణ్-జాన్వీ-శ్రుతి.. !

తాజావార్తలు