Homeసినిమాఅప్పుడు చిరు-శ్రీదేవి-కమల్.. ఇప్పుడు చరణ్-జాన్వీ-శ్రుతి.. !

అప్పుడు చిరు-శ్రీదేవి-కమల్.. ఇప్పుడు చరణ్-జాన్వీ-శ్రుతి.. !

క్రైమ్ మిర్రర్, సినిమా :- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ మాత్రం ఫ్యాన్స్‌లో మరింత హైప్ పెంచేసింది. ఒకే సాంగ్‌లో రామ్ చరణ్‌తో పాటు జాన్వీ కపూర్, శ్రుతి హాసన్ కనిపించనున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు సినీ అభిమానులకు ఇది కేవలం ఓ పాట మాత్రమే కాదు.. ఓ స్పెషల్ కాంబినేషన్. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అతిలోకసుందరి శ్రీదేవి, కమల్ హాసన్ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు వారి తర్వాతి తరం వారసులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, శ్రుతి హాసన్ పెద్ది లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మరో లెవెల్‌కి చేరింది.

హాల్లలల్లో.. హాల్లో అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌లో ఈ ముగ్గురు స్టెప్పులు అదిరిపోయేలా ఉంటాయని టాక్. ముఖ్యంగా రామ్ చరణ్-శ్రుతి హాసన్ కాంబోకు ఇప్పటికే ఎవడు లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జాన్వీ కపూర్‌తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు దర్శకుడు బుచ్చిబాబు సన. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగాయి.కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్ ఉంటుందని కూడా టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా ముగింపు ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్‌కు ఒక పెద్ద హిట్ అవసరమని భావిస్తున్న సమయంలో ‘పెద్ది’ ఆ లోటు తీర్చేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం మాత్రం ఒక్క పాటతోనే చరణ్-జాన్వీ-శ్రుతి కాంబో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు