Homeసినిమాఎన్టీఆర్‌కు లైఫ్ ఇచ్చిన మూవీ అదే.. ఇప్పుడు వస్తే ₹1000 కోట్లు ఖాయం: బండ్ల గణేశ్

ఎన్టీఆర్‌కు లైఫ్ ఇచ్చిన మూవీ అదే.. ఇప్పుడు వస్తే ₹1000 కోట్లు ఖాయం: బండ్ల గణేశ్

క్రైమ్ మిర్రర్, సినిమా:- పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తున్న వేళ.. నిర్మాత బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన టెంపర్ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారి తీశాయి.నటుడు రాజా రవీంద్ర ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేశ్.. వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్‌కు బాద్‌షా, టెంపర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చానని చెప్పారు. టెంపర్ కథ విన్న వెంటనే అది పెద్ద హిట్ అవుతుందని నమ్మి దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గరకు తీసుకెళ్లానని తెలిపారు.

ఆ కథ విన్న పూరీ జగన్నాథ్.. ఇది నీకు మరో గబ్బర్‌సింగ్ అవుతుంది అని అప్పుడే చెప్పారని బండ్ల గణేశ్ గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. అదే టెంపర్ సినిమాను ఇప్పుడు తీసి రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించేదని అన్నారు.ఈ మూవీలో ఎన్టీఆర్ నటన గురించి కూడా బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ ఆ సినిమాలో తన నటనతో చింపేశాడు.. కెరీర్‌లో కీలక మలుపు అక్కడే మొదలైంది అంటూ ప్రశంసించారు.2015లో విడుదలైన టెంపర్ మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అదే సినిమా తర్వాత ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాటిచ్చారు. ఆ తర్వాత వరుస విజయాలు అందుకున్నారు.ఇక ప్రస్తుతం డ్రాగన్ మూవీపై భారీ అంచనాలు ఉన్న సమయంలో.. టెంపర్ పై బండ్ల గణేశ్ చేసిన ఈ కామెంట్స్ అభిమానుల్లో మరింత జోష్ పెంచుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు