Homeతెలంగాణసర్పంచ్ పదవి వేలం.. 73 లక్షలకు దక్కించుకున్న ముస్లిం మహిళ

సర్పంచ్ పదవి వేలం.. 73 లక్షలకు దక్కించుకున్న ముస్లిం మహిళ

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సర్పంచ్ పదవిని వేలం వెయ్యడం ఈ  వేలం లో సర్పంచ్ పదవిని ఒక ముస్లిం మహిళ కుటుంబ సభ్యులు అత్యధికంగా రూ. 73 లక్షలు పలకడం ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…నల్గొండ జిల్లాలోని బంగారిగడ్డ గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం సర్పంచ్ పదవిని వేలం వేసిన సంఘటన జరిగింది.
ఈ వేలంలో సర్పంచ్ పదవిని ఒక ముస్లిం మహిళ తరపున ఆమె కుటుంబ సభ్యులు రూ. 73 లక్షలకు దక్కించుకున్నారు. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయడానికి జరిగిన వేలంలో అత్యధికంగా రూ. 73 లక్షలు పలికింది. గ్రామాభివృద్ధి మరియు ఆలయ నిర్మాణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
అయితే, ఈ విధంగా పదవులను వేలం వేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, వేలం జరిగిన చోట ఎన్నికలను రద్దు చేస్తామని హెచ్చరించింది.
గతంలో కూడా తెలంగాణలోని ఇతర జిల్లాలైన ఖమ్మం, నిర్మల్ వంటి ప్రాంతాలలో సర్పంచ్ పదవులను లక్షలకు వేలం వేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు