-
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా పురందేశ్వరి…!
-
కేంద్ర పెద్దల ఆఫర్
-
ఎన్టీఆర్ కుమార్తెకు అరుదైన గౌరవం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కేంద్రంలో ఎన్డీఏ రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. అయితే ఏపీకి ఈసారి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది, ముఖ్యంగా ఒక కేంద్ర సహాయ మంత్రి పదవితో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఏపీకి కేటాయిస్తారని తెలుస్తోంది.
Also Read: Good News: ఒకటో తేదీనే జీతాలు తప్పనిసరి.. ఆలస్యమైతే చర్యలు..!
కేంద్ర మంత్రి పదవికి సంబంధించి టిడిపి నుంచి కానీ.. జనసేన నుంచి కానీ ఒకరికి ఛాన్స్ దక్కే పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం అనూహ్యంగా బిజెపి ఎంపీ కి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
గత కొంతకాలంగా ఖాళీ..
గత కొంతకాలంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కేటాయిస్తూ ఒక సంప్రదాయం కొనసాగుతోంది. కానీ రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోస్టు భర్తీ చేయలేదు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ తీవ్రంగా విభేదించడంతో.. ఆ పదవి ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు పెద్దగా సుముఖత చూపలేదు.
Also Read: జూన్ 11న ఖర్గే సారథ్యంలో ఏఐసీసీ అత్యవసర సమావేశం..
అలాగని సొంత పార్టీ నేతలతోనూ భర్తీ చేయలేదు. అయితే ఇటీవల నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దేశానికి ప్రయోజనం కలిగించే బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించడంతో బీజేపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ పోస్టును కాంగ్రెస్ పార్టీకి కాకుండా… తమ పార్టీ నేతతోనే భర్తీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
సీనియర్ నాయకురాలిగా..
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పోస్టుకు ప్రముఖంగా పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. ఆమె కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. 2009లో సైతం రెండోసారి గెలిచారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని విభేదించి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఆమె ఒక కారణం. రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన ఆమె కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు.
Also Read: గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు…!
ఇప్పుడు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీకి మరో గౌరవం దక్కినట్టే. తెలుగు రాష్ట్రాల నుంచి తొలి స్పీకర్ గా జీవీఎంసీ బాలయోగి వ్యవహరించారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో మహిళా నేత పురందేశ్వరి మరింత గుర్తింపు దక్కించుకోనున్నారు.
Also Read: ఖమ్మంలో మానవ మృగం.. 12 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి