క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందే జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. అయితే ఈ నలుగురు ఎన్నిక లాంఛనమే. ఎందుకంటే ఏపీలో టిడిపి కూటమికి ఏకపక్షంగా బలం ఉంది. కనీసం వైసిపి నామినేషన్ వేయలేదు. అందుకే నలుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
ఆఫిడవిట్ లో ఆస్తుల వివరాలు
అయితే ఈ నలుగురు తమ నామినేషన్ అఫీడవిట్ లో ఆస్తులను పేర్కొన్నారు. టిడిపి నుంచి ఏకగ్రీవం కానున్న ముగ్గురు అభ్యర్థుల్లో.. భాష్యం రామకృష్ణ ఆస్తుల్లో టాప్ గా నిలిచారు. చింతకాయల విజయ్ కంటే ఆయన భార్య పేరుతో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. టిడిపి నుంచి బరిలో దిగుతున్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా భాష్యం రామకృష్ణ నిలిచారు. ఆయన కుటుంబం మొత్తం ఆస్తులు విలువ రూ.672.61 కోట్లు. ఇందులో ఏకంగా రూ.502.64 కోట్ల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన ఒక్కరి పేరుతోనే రూ.454.95 కోట్లు ఉండడం విశేషం. మిగతావి మాత్రం కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నాయి. అయితే వ్యాపార విస్తరణ నిమిత్తం ఆర్థిక సంస్థల నుంచి 200 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు కూడా చెప్పారు. ఆయనపై హైదరాబాదులో ఒక పాత వాహన ప్రమాదం ఎటువంటి నేరపూరిత కేసులు లేవు.
- ఇంకోవైపు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పారిశ్రామికవేత్త సానా సతీష్ అఫీడవిట్ విషయంలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆయనకు సొంత ఇల్లు లేదని తేలింది.
- చింతకాయల విజయ్ విషయానికి వస్తే ఆయన కుటుంబానికి 38 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. అందులో 30 రెండు కోట్ల వరకు స్థిరాస్తులు ఉన్నాయి. 16.91 కోట్లు అప్పులుగా చూపారు. అయితే విజయ్ ఆస్తుల్లో సింహభాగం ఆయన భార్య పేరుతో ఉండడం విశేషం.
- రాజ్యసభ సభ్యుల నామినేషన్ల గడువు ఈనెల 8 తో ముగిసింది. నలుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఒక్కో నామినేషన్ రావడంతో వీరంతా ఏకగ్రీవం అయినట్టే.
- ఈనెల 18న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పది రాష్ట్రాల్లో 24 రాజ్యసభ సీట్లకు పోలింగ్ జరగనుంది. కానీ ఏపీలో మాత్రం ముందుగానే ఏకగ్రీవం అయ్యాయి నాలుగు స్థానాలు.