Hometelanganaక్యాబినెట్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!!!

క్యాబినెట్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!!!

  • జాతీయ కార్యవర్గంలోకి వెంకట్ రెడ్డి
  • తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో ఛాన్స్
  • ఢిల్లీకి క్యూ కడుతున్న నేతలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. తమకు మంత్రి పదవులు కేటాయించాలని కోరుతున్నారు. హై కమాండ్ పై రకరకాల ఒత్తిడిలు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తన మనసులో ఉన్న మాటను చెప్పుకున్నారు. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీ చేర్పులు మార్పులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయి. మరోవైపు ఒకరిద్దరి మంత్రులను మార్చి కొత్తవారిని తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ అనుమతి తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో చేర్పులు మార్పులపై చర్చించారు.

చాలా రోజులుగా ప్రయత్నాలు..

మంత్రివర్గంలో చోటు కోసం చాలామంది కాంగ్రెస్ నేతలు వారాల కిందట తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో భేటీ అయ్యారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు అవకాశం కల్పించాలని రాహుల్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ని క్యాబినెట్లోకి తీసుకుంటే.. వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉంది. ఆయనను ఏఐసీసీ కార్యవర్గంలోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకే ఇంట్లో ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం కుదరదు. అందుకే వెంకటరెడ్డికి జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆయన విషయంలో హై కమాండ్ సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

స్పీకర్ సైతం..

మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు విజయశాంతి పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం క్యాబినెట్లో మహిళా మంత్రులుగా సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరి మార్పు ఉంటుందన్న టాగ్ కూడా ఉంది. మరోవైపు స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ మంత్రి పదవిని కోరుకుంటున్నారు. ఆయనను తప్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటే మరో సీనియర్ కు స్పీకర్గా ఛాన్స్ ఇవ్వనున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే మరో బీసీ అయిన పొన్నం ప్రభాకర్కు రాష్ట్ర పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే అన్నింటికీ మించి కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలోనే ఎక్కువగా ప్రచారం నడుస్తోంది. ఒకరికి మంత్రి.. మరొకరికి పార్టీ బాధ్యతలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు