Homeక్రైమ్స్టేషన్‌లో కలకలం రేపిన వృద్ధుడి మృతి.. రైల్వే పోలీసుల విచారణ కొనసాగింపు

స్టేషన్‌లో కలకలం రేపిన వృద్ధుడి మృతి.. రైల్వే పోలీసుల విచారణ కొనసాగింపు

క్రైం మిర్రర్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఓ వృద్ధుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో స్టేషన్‌లోని షంటింగ్ లైన్–1 ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ నుంచి డెత్ మెసేజ్ అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 381/2026గా కేసు నమోదు చేసిన అనంతరం ఎస్‌ఐ ఎస్‌వీ సుబ్బారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. అక్కడి ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరిస్తూ మృతుడి వివరాలను నిర్ధారించారు.పోలీసుల విచారణలో మృతుడు ఘండియా కర్షన్‌భాయ్ రతన్ శిభాయ్ (75)గా గుర్తించారు. ఆయన తండ్రి పేరు రతన్‌శిభాయ్. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా నాగారం, ఈసీఐఎల్ ప్రాంతంలో నివాసం ఉంటుండగా, స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లా, మోర్వి ప్రాంతమని పోలీసులు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో ఆయన షంటింగ్ లైన్–1 ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని రైల్వే పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
also read : హైదరాబాద్ శివారులో విషాదం: మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు