Homeక్రైమ్కడుపు నొప్పితో ఆస్పత్రికి.. పరీక్షల్లో గర్భం వెలుగులోకి, నిందితుడిపై పోక్సో కేసు

కడుపు నొప్పితో ఆస్పత్రికి.. పరీక్షల్లో గర్భం వెలుగులోకి, నిందితుడిపై పోక్సో కేసు

క్రైం మిర్రర్ : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భం దాల్చేలా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టూటౌన్ సీఐ ఎం. మురళి తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజులుగా మైనర్ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భవతిగా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఆ తర్వాత బాలికను కుటుంబ సభ్యులు జరిగిన విషయంపై ప్రశ్నించగా, సిద్దిపేటకు చెందిన ఆరోల్ల నర్సింలు తనను పలుమార్లు తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన టూటౌన్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సేకరించిన ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు ఆరోల్ల నర్సింలును అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు ఇతర వర్తించే చట్టాల కింద కేసు నమోదు చేశారు.

అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ ఎం. మురళి తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మైనర్లపై నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
read also : ఫోరెన్సిక్ పీజీ విద్యార్థి మృతి.. ఆంధ్ర మెడికల్ కళాశాలలో విషాద ఘటన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు