HomeతెలంగాణBig Breaking: సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) లకు ఒకేసారి పదోన్నతి అవకాశం..!

Big Breaking: సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) లకు ఒకేసారి పదోన్నతి అవకాశం..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ పోలీస్ శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల నియామక ప్రక్రియను “జోనల్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి” (State Level) మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భవిష్యత్తులో జరిగే నియామకాలు, పదోన్నతుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానం అమలులోకి రానుంది తెలుస్తుంది.

ప్రస్తుతం జోనల్ విధానం వల్ల ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు వేర్వేరు జోన్లలో ఖాళీలను బట్టి వేర్వేరు సమయాల్లో ప్రమోషన్లు వస్తున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టుగా మారితే, అందరికీ సీనియారిటీ ఆధారంగా ఒకేసారి పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి మరియు రాష్ట్రవ్యాప్త అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేపట్టడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. ఈ మార్పుకు సంబంధించి పోలీస్ సర్వీస్ రూల్స్‌లో అవసరమైన సవరణలను అధికారులు ప్రతిపాదించారు అని సమాచారం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు