Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో చచ్చిపోతున్నా పవన్‌కు కనపడదు: పేర్ని నాని ఫైర్

ఏపీలో చచ్చిపోతున్నా పవన్‌కు కనపడదు: పేర్ని నాని ఫైర్

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో అనారోగ్యంతో ఉన్న బాలుడిని పరామర్శించేందుకు పవన్ వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏపీలో జనసైనికులు, ప్రజలు కష్టాల్లో ఉన్నా పవన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.’ఏపీలో ఉండే జనసైనికులు పవన్‌కు కనిపించరు. తెలంగాణలో ఎవరో ఒంట్లో బాగోలేదని అనగానే పరిగెత్తారు. ఇక్కడ తన కొడుకు చచ్చిపోయాడని ఒక తల్లి ఏడుస్తుంటే అది కనపడదు. ఇళ్లు నేలమట్టం చేశారని కన్నీళ్లు పెట్టుకుంటే అది వినపడదు. టీడీపీ వాళ్లు మా ఆస్తులు లాక్కుంటున్నారని జనసైనికులు చెబుతున్నా పవన్ పట్టించుకోరు’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంపై ఉన్న ప్రేమ పవన్‌కు సొంత రాష్ట్రంపై లేదని ఆయన విమర్శించారు.

డెహ్రాడూన్‌లో విషాదం…నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య…!!

ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్యతో అమీర్ ఖాన్.. నువ్వు మామూలోడివి కాదు మాస్టారూ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు