Homeఆంధ్ర ప్రదేశ్విశాఖ బీచ్‌లో ఇక చిల్‌ అవ్వాల్సిందే.. బీచ్‌ సాక్స్‌ ఏర్పాటుకు నిర్ణయం.!

విశాఖ బీచ్‌లో ఇక చిల్‌ అవ్వాల్సిందే.. బీచ్‌ సాక్స్‌ ఏర్పాటుకు నిర్ణయం.!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : విశాఖలో గోవా తరహాలో బీచ్‌లో బార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తీర పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని బీచ్‌ ప్రాతాల్లో ప్రత్యేకంగా బీచ్‌ సాక్స్‌ పేరుతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్‌శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) గుర్తించిన ప్రాంతాల్లో బీచ్‌ సాక్స్‌ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులను ఆకర్షించడం, తీర ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపర్చడం, స్థానిక ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. వీటి ఏర్పాటు పట్ల ప్రతిపక్షాలు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం ముందుకే వెళుతోంది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో కొద్దిరోజుల్లో ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా అమలు..

ఈ బీచ్‌ సాక్స్‌ను తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా కొన్నిచోట్ల అమలు చేయాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బీచ్‌ సాక్స్‌ పనితీరును ఏడాదిపాటు పరిశీలించనున్నారు. అనంతరం వాటి నిర్వహణ, పర్యాటకుల సందర్శన, ఆర్థిక ప్రయోజనాలు వంటి అంశాలపైసమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలకు విస్తరించేలా.? వద్దా.? అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇకపోతే, ఎంపిక చేసిన చోట్ల ఏర్పాటు చేయనున్న బీచ్‌ సాక్స్‌లో ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, విదేశీ మధ్యం విక్రయాలకు అనుమతి ఉండదని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కేంద్రాలు నిర్వహణ, అనుమతులు, కార్యకలాపాలకు సంబంధించిన విఽధివిధానాలతో కూడిన గైడ్‌లైన్స్‌ను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బీచ్‌ సాక్స్‌ను పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్ధేశంతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ బీచ్‌ సాక్స్‌ ఏర్పాటు చేసే ప్రాంతాలకు గోవా తరహాలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల టూరిజం సరికొత్త పుంతలు తొక్కుతుందని పర్యాటకశాఖ కూడా భావిస్తోంది. ఈ బీచ్‌ సాక్స్‌ ఏర్పాటు చేసే ప్రాంతాలు సరికొత్త టూరిజం హబ్స్‌గా మారుతాయన్న అభిప్రాయాన్ని పర్యాటక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే అనేక టూరిజం స్పాట్స్‌ ఉండగా, కొత్తగా ఏర్పాటు కానున్న బీచ్‌ సాక్స్‌ టూరిజానికి మరింత ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు