-
టీపీసీసీ ప్రెసిడెంట్ పై ఆగని వ్యతిరేక ప్రచారం
-
సొంత అజెండాతో ముందుకు వెళుతుండడమే కారణం
-
ఆగ్రహంగా సీఎం రేవంత్ వర్గం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ ఆ వివాదాలు ఏంటి? అనుకూల మీడియాలో వ్యతిరేక కథనాలు వెనుక ఉన్నది ఎవరు? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే ప్రచారం నడుస్తోంది. కొన్ని మీడియా ఛానల్స్ లో డిజాస్టర్ టిపిసిసి ప్రెసిడెంట్ అంటూ వరుసగా కథనాలు వస్తున్నాయి. కానీ సీఎం రేవంత్ శిబిరం నుంచి ఈ కథనాలను అడ్డుకునే ప్రయత్నం జరగడం లేదన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో కాక రేపుతోంది.
-
ఒక సాధారణ నేతగా ఉండగా..
కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ నేతగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టిపిసిసి ప్రెసిడెంట్ గా కూర్చోబెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కీలకం. అయితే సీఎం రేవంత్ ఆశించిన స్థాయిలో మహేష్ గౌడ్ పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఆయన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ.
అసలు కార్పొరేటర్ కూడా కానీ మహేష్ గౌడ్ ను పదవి అప్పగిస్తే.. ఆయన సీఎం రేవంత్ వర్గాన్ని లెక్కచేయడం లేదు అనేది ప్రధాన విమర్శ. టిపిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తే.. ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ గౌడ్ అనుకున్న రీతిలో పనిచేయడం లేదన్న విమర్శ తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో బలంగా ఉంది.
-
భూ వివాదాల్లో..
వరంగల్ ప్రాంతంలో తన సొంత అజెండాతో ముందుకు వెళుతుండడంతో చాలామంది ఎమ్మెల్యేలు మహేష్ గౌడ్ పై సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రకాల భూ వివాదాల్లో సైతం మహేష్ గౌడ్ తల దూర్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం.. అందులోనూ రేవంత్ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
అందుకే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటే మీడియా ఛానళ్లలో మహేష్ గౌడ్ పై వ్యతిరేక కథనాలు వస్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ప్రారంభంలో సీఎం రేవంత్ సూచనలను పరిగణలోకి తీసుకున్న మహేష్.. తరువాత సొంత అజెండాతో ముందుకు వెళ్లడం వల్లే ఈ సమస్యలు అని తెలుస్తోంది. అందుకే త్వరలో మహేష్ గౌడ్ మార్పు ఉంటుందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన గాంధీభవన్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని.. మార్పు అనివార్యం అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..