Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీ నేత జోగి రమేష్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసు

వైసీపీ నేత జోగి రమేష్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసు

 

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నాయకుడు జోగి రమేష్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. గురువారం రోజు వైసీపీ అధినేత జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారని జోగి రమేష్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు. దీంతో ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన రమేష్‌కు మరోషాక్‌ తగిలినట్టయింది. విజయవాడ ఇబ్రహీంటప్నంలోని నివాసంలో జోగి రమేష్‌ను పరామర్శించేందుకు జగన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ ర్యాలీలు, పబ్లిక్‌ న్యూసెన్స్‌తో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రవివర్మ ఫిర్యాదు మేరకు జోగి రమేష్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తాజావార్తలు