Homeతెలంగాణమున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప‌కడ్బందీగా నిర్వహించాలి

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప‌కడ్బందీగా నిర్వహించాలి

రెండవ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్

జగిత్యాల, క్రైం మిర్ర‌ర్ః

మున్సిప‌ల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు.

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది జిల్లాక‌లెక్ట‌రేట్‌లోని క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించారు.

ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ బుధవారం జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు సమక్షంలో రెండవ రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.

ఈసంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వ‌హించాల‌న్నారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారి కె. రాము, కలెక్టరేట్ ఏవో హకిమ్, ఈడిఏం మమత మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు