Homeతెలంగాణఅవ‌గాహ‌న‌తోనే క్యాన్స‌ర్‌కు అడ్డుక‌ట్ట‌

అవ‌గాహ‌న‌తోనే క్యాన్స‌ర్‌కు అడ్డుక‌ట్ట‌

  • ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి

  • అవగాహన కోసం షార్ట్‌ ఫలిమ్స్ తీస్తా

  • క్యాన్సర్ దినోత్సవంలో చిరంజీవి

హైదరాబాద్,క్రైం మిర్ర‌ర్ః

అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోనే క్యాన్స‌ర్‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చున‌ని మెగాస్ట‌ర్ చిరంజీవి అన్నారు.

శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌ను గ‌మ‌నించాలన్నారు. ముందుగానే గుర్తిస్తే న‌యం చేసుకోవ‌డానికి వీలుంటుంద‌న్నారు.

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజ‌రై మాట్లాడారు.

ప్ర‌తి ఒక్క‌రు జీవ‌న‌శైలిలో మార్పు చేసుకొని ఆరోగ్య‌క‌ర‌మైన వాటినే తినాల‌ని సూచించారు. భ‌విష్య‌త్‌లో క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న కోసం షార్ట్ ఫిలీం తీయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపారు.

శరీరం చెప్పే మాట అందరూ వినాలి. నాకు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్యం చేయకూడద‌న్నారు.

మన అలవాట్లు, వాతావరణం, వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. మొదటి దశలోనే దాన్ని గుర్తిస్తే 90 శాతం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపారు.

అమ్మాయిలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్‌లు వేయిస్తే కొన్నిరకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడొచ్చు.

మహిళలు కూడా జాగ్రత్తగా ఉండి వ్యాక్సిన్‌లు తీసుకోవాల‌ని కోరారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు