కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు పార్లమెంట్‌లో కీలక ముందడుగు పడింది. రాష్ట్రం పేరును మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లుపై సభలో ప్రక్రియ కొనసాగింది. అనంతరం మూజువాణి ఓటుతో లోక్‌సభ బిల్లును ఆమోదించింది. దీంతో కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయింది.
రాష్ట్రం పేరును అధికారికంగా మార్చేందుకు రాజ్యాంగపరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఆమోదంతో ఈ ప్రక్రియలో ముందడుగు పడినట్లయింది. ఇక తదుపరి దశల్లో బిల్లుకు సంబంధించిన పార్లమెంటరీ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.
‘కేరళం’ అనే పేరును అధికారికంగా అమలు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా రాష్ట్రంలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
also read: ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్.. స్టైఫండ్ పెంచాలని డిమాండ్
