మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా భర్త మరో యువతితో డ్యాన్స్ చేయడం చూసి మనస్తాపానికి గురైన ఓ మహిళ పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది.
కాసిపేట మండలం సోనాపూర్ గ్రామానికి చెందిన సంధ్యకు జంగుతో వివాహమైంది. గురువారం గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం మత్తులో ఉన్న జంగు మరో యువతితో కలిసి డ్యాన్స్ చేసినట్లు సమాచారం.
ఈ దృశ్యాన్ని చూసిన సంధ్య తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. అనంతరం ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత సంధ్య ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో శుక్రవారం సంధ్య మృతి చెందింది. ఈ ఘటనతో సోనాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.
also read: యువతిని ముక్కలుగా నరికి కెనాల్ లో పడేసిన కేసులో కీలక మలుపు- టాటూతో మృతదేహం గుర్తింపు
