Homeక్రైమ్యువతిని ముక్కలుగా నరికి కెనాల్ లో పడేసిన కేసులో కీలక మలుపు- టాటూతో మృతదేహం గుర్తింపు

యువతిని ముక్కలుగా నరికి కెనాల్ లో పడేసిన కేసులో కీలక మలుపు- టాటూతో మృతదేహం గుర్తింపు

విజయవాడ ఇబ్రహీంపట్నం పరిధిలో యువతి హత్య కేసు పోలీసుల దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. కూలింగ్‌ కెనాల్‌లో ముక్కలుగా లభించిన మృతదేహం మంగళగిరికి చెందిన కళ్యాణిదిగా పోలీసులు గుర్తించారు. ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా మృతురాలి వివరాలను నిర్ధారించినట్లు తెలిపారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. యువతిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కాళ్లు, చేతులు, మొండెం, తల వంటి భాగాలుగా విడదీసి కూలింగ్‌ కెనాల్‌లో వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కళ్యాణి హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలు, వివాహేతర సంబంధం కోణాల్లో వివరాలను సేకరిస్తున్నారు. హత్యకు ముందు కళ్యాణి ఎవరితో మాట్లాడింది? ఎవరితో కలిసి నివసించింది? ఆమెకు ఎవరితో పరిచయాలు ఉన్నాయి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అలాగే కళ్యాణి చివరిసారిగా ఎవరిని కలిసింది, ఆమె ఫోన్‌ కాల్స్‌, ఇతర వివరాలను పరిశీలిస్తూ కేసులో నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించిన అనంతరం దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన పోలీసులు, ఈ హత్య వెనుక అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావడంపై దృష్టి సారించారు.

also read: UP: ఘాజియాబాద్‌లో విషాదం.. 12వ అంతస్తు నుంచి పడి జాతీయ స్థాయి ఛాంపియన్‌ మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు