Homeఆంధ్ర ప్రదేశ్పవన్ కల్యాణ్ పేరుతో నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

పవన్ కల్యాణ్ పేరుతో నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెంకు చెందిన తీర్థాల నాగ వెంకట దుర్గ రాకేశ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాకేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరుతో నకిలీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఖాతా ద్వారా నారా లోకేశ్‌కు సంబంధించినవిగా పేర్కొంటూ కల్పిత పోస్టులు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు ఉన్నట్లుగా చూపించే ఉద్దేశంతో ఈ తరహా పోస్టులు, వీడియోలను సర్క్యులేట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు చెబుతున్న వీడియోలు, పోస్టుల మూలాలు ఏమిటి? వాటిని రూపొందించడం లేదా వైరల్ చేయడంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రాజకీయ నాయకులపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఘటనలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

ఈ కేసులో అరెస్టైన వ్యక్తి నుంచి మరింత సమాచారం సేకరించి, సోషల్ మీడియా పోస్టుల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

also read: హైదరాబాద్‌లో బైక్ స్టంట్లతో రెచ్చిపోయిన యువకులు.. ముగ్గురి అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు