Homeఆంధ్ర ప్రదేశ్సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు సిట్ ఏర్పాటు.!

సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు సిట్ ఏర్పాటు.!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలో రౌడీ షీటర్ అయిన సాయి కృష్ణను పోలీసులు లాకప్ డెత్ చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. గత కొద్దిరోజులుగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. సిఐ నాగరాజు లాకప్ డెత్ చేశారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఈ వ్యవహారంపై విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ రవి ప్రకాష్, సభ్యులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం సమీ, బాపట్ల అడిషనల్ ఎస్.పి.ఎల్ సుధాకర్ ను ప్రభుత్వం నియమించింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్టు అయింది. లాక్ అప్ డెత్ అయినట్లు భావిస్తున్న సాయి కృష్ణ కుటుంబాన్ని కొద్ది రోజుల క్రిందట మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ మరుసటి రోజే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆ కుటుంబాన్ని తన వద్దకు పిలిపించుకొని వారికి భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణకు వారి కుటుంబానికి హామీ ఇచ్చిందని చెబుతున్నారు. అందులో భాగంగానే తాజాగా సిట్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

విచారణ వేగవంతం చేసిన పోలీసులు..

సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు జోరు పెంచారు. దర్యాప్తుల భాగంగా పోలీసులు కృష్ణలంక స్వర్గపురి స్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ పనిచేసే భాష అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసిన అనంతరమే ఇక్కడ ఖననం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడే పనిచేసే సిబ్బందిని పోలీసులు విచారించి పూర్తిస్థాయి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సాయి కృష్ణ కనిపించకుండా పోయిన రోజు నుంచి పలు అనాధ మృతదేహాల నిర్వహణలోనిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నేస్ ఆపరేటర్ భాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అనాధ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రక్రియను పూర్తిగా పాటించారా.? లేదా.?, రికార్డులను సక్రమంగా నిర్వహించారా.? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా.? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు.? అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆదివారం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నా సీఐ నాగరాజును కూడా ఈ బృందం విచారించే అవకాశం ఉంది. అయితే సిఐ నాగరాజు కనిపించడం లేదు అన్న ప్రచారం జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన నుంచి స్పందన లేదన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సిట్ బృందం ఎలా వ్యవహరిస్తుంది అన్నది కీలకంగా మారింది. ఇప్పటివరకు లాక్ అప్ డెత్ వ్యవహారంపై అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా సాయి కృష్ణ మృతి వెనక 25 కోట్ల భూ కుంభకోణం ఉంది అన్న ప్రచారం జరుగుతుంది. దీని వెనక పెద్దల హస్తం ఉండడం వల్లే విచారణ సవ్యంగా జరగలేదని, సిఐ నాగరాజు కూడా విచారణకు సహకరించడం లేదని చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన సిట్ ఎలా ముందుకు వెళుతుందో చూడాల్సి ఉంది.

జస్ట్ 70 నిమిషాలే.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు