Homeఆంధ్ర ప్రదేశ్76 ఏళ్ల వయసులో 'బాబా'కు పోటీగా 'సీఎం బాబు' ఆసనాలు..!

76 ఏళ్ల వయసులో ‘బాబా’కు పోటీగా ‘సీఎం బాబు’ ఆసనాలు..!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన యోగాసనాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. 76 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో చురుకుగా కఠినమైన ఆసనాలు వేసి తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు.విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏపీ ప్రభుత్వం ‘యోగాంధ్ర’ పేరిట ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తో పోటీ పడి మరీ పలు ఆసనాలను వేశారు. ముఖ్యంగా వేయడానికి ఎంతో కష్టమైన ‘సేతు బంధనాసనాన్ని’ ఆయన అత్యంత సులువుగా ప్రదర్శించారు.76 సంవత్సరాల వయసులో చంద్రబాబు ఇంత ఆక్టివ్‌గా ఉంటూ, సునాయాసంగా యోగాసనాలు వేయడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని ఆయన నిరూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు.

సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు సిట్ ఏర్పాటు.!

జస్ట్ 70 నిమిషాలే.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు