బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌పై చండీగఢ్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్‌కు సంబంధించిన మోసం ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. అక్టోబర్ 5న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ కేసు చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మణిమజ్రా ప్రాంతంలో ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు కోసం కంపెనీ ప్రతినిధులు తాను సంప్రదించారని, వ్యాపారం అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ నమ్మకంతో దాదాపు రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.
అయితే, ఒప్పందంలోని నిబంధనలు పూర్తిగా పాటించినప్పటికీ, షోరూమ్ ప్రారంభమైన తర్వాత కంపెనీ నుంచి ఎలాంటి సహకారం అందలేదని గుప్తా పేర్కొన్నారు. ముఖ్యంగా 2020 ఫిబ్రవరి నుంచి నగల సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, దీంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతిని షోరూమ్ మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ పరిణామాలతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలను సంబంధిత సంస్థ గతంలోనే ఖండించింది. సదరు ఒప్పందంలో సల్మాన్ ఖాన్‌కు ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, కోర్టు విచారణలో భాగంగా సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్‌తో పాటు ‘స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్లకు కూడా నోటీసులు పంపింది.
ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 5న జరగనుంది. అప్పటివరకు ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారే అవకాశముంది.
also read: వీడియో కాల్‌లో తండ్రికి చివరి వీడ్కోలు… హర్యానాలో హృదయవిదారక ఘటన
