Homeఆంధ్ర ప్రదేశ్తెలంగాణ, ఏపీల్లో వర్షాలు: పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ

తెలంగాణ, ఏపీల్లో వర్షాలు: పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ

క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. నేడు (ఇవాళ) పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వాతావరణ శాఖ.. తెలంగాణలోని కింది జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మరియు నాగర్ కర్నూల్.ఈ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీలోనూ వర్షాలు:- మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ వాతావరణం మారిపోయింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా ఇవాళ వానలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఒక ప్రకటనలో పేర్కొంది.

మహిళల టీ20 ప్రపంచకప్: సెమీస్ రేసులో నేడు దక్షిణాఫ్రికాతో భారత్ కీలక సమరం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు