క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై అద్భుత విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టు.. ఈరోజు రాత్రి 7 గంటలకు పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది.గ్రూప్-ఏ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం:ప్రస్తుతం గ్రూప్-ఏ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు గెలుపొంది, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ సెమీఫైనల్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.రెండో స్థానం కోసం త్రిముఖ పోటీ:గ్రూప్-ఏ నుంచి ఆసీస్ మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉండటంతో, ఇక మిగిలిన రెండో స్థానం (సెమీస్ బెర్తు) కోసం భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి కీలక మ్యాచ్‌లో కనుక టీమిండియా గెలిస్తే సెమీస్ అవకాశాలు అమాంతం పెరుగుతాయి.గ్రూప్-బి లో మరో మ్యాచ్…ఇక గ్రూప్-బి లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న మరో మ్యాచ్‌లో వెస్టిండీస్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా.. ఇకపై నేరుగా ప్రజలతోనే నా అభిప్రాయాలు: డిప్యూటీ సీఎం
బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ కాంట్రవర్సీ యూట్యూబర్ ఎంట్రీ పక్కా!