క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ పార్టీకి లీడర్స్ ఉన్నారని.. కేడర్ ఉందని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తెలంగాణలో లక్షన్నర మంది సభ్యత్వం జనసేనకు ఉందని ప్రస్తావించారు. వాళ్లు ఉత్సాహంగా ఉన్నప్పుడు.. వారి కోసం పనిచేయొద్దా? అని ప్రశ్నించారు. కర్ణాటక, తమిళనాడులో ఉన్నవారి కోసం ఏమైనా చేయాలి కదా అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు కాదని.. విభజన జరిగిన తీరుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలోకి తనను రావొద్దనడం తన ప్రాథమిక హక్కుకి భంగం కలిగించినట్లేనని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఏనాడూ ఇలా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని విమర్శించారు. ‘13 నెలలుగా నన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తే.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని అనడం తప్పా?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
తెలంగాణ మీ అయ్య జాగీరా అని అనడం తప్పా?.. పవన్ కల్యాణ్
By Crime Mirror
0
125
Previous article
Next article
