Homeఆంధ్ర ప్రదేశ్పర్యాటకులకు గుడ్ న్యూస్.. కృష్ణానదిలో ఇక సోలార్ బోట్ల సందడి.. !

పర్యాటకులకు గుడ్ న్యూస్.. కృష్ణానదిలో ఇక సోలార్ బోట్ల సందడి.. !

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానదిలో పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు డీజిల్ బోట్ల స్థానంలో సోలార్ శక్తితో నడిచే బోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పర్యాటక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ చర్యలు చేపడుతోంది.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) బోర్డు సమావేశంలో సోలార్ మెకనైజ్డ్ బోటు నమూనాను సభ్యులకు ప్రదర్శించింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా నాలుగు సోలార్ బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజయవాడలో కృష్ణానదిపై పర్యాటకుల కోసం డీజిల్ బోట్లు నడుస్తుండగా, వాటి స్థానంలో ఈ కొత్త బోట్లు అందుబాటులోకి రానున్నాయి.

విశాఖ రుషికొండ భవనాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

డీజిల్ ధరలు పెరుగుతుండటంతో బోట్ల నిర్వహణ వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. అంతేకాకుండా డీజిల్ బోట్ల వల్ల జల కాలుష్యం, శబ్ద కాలుష్యం కూడా అధికంగా ఉంటోంది. ఈ సమస్యలను తగ్గించేందుకు సోలార్ బోట్లను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ.30 లక్షలు ఉండగా, సోలార్ మెకనైజ్డ్ బోటు ధర రూ.50 లక్షల వరకు ఉంటుంది. నాలుగు బోట్ల కొనుగోలుకు సుమారు రూ.2 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ప్రాజెక్టు కోసం త్వరలో టెండర్లు పిలిచి తక్కువ ధరకు నాణ్యమైన బోట్లను అందించే సంస్థను ఎంపిక చేయనున్నారు. దాదాపు రెండు నెలల్లో ఈ సోలార్ బోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బోట్లు వినియోగంలోకి వస్తే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం రెండూ తగ్గడంతో పాటు పర్యాటకులకు మరింత ప్రశాంతమైన బోటింగ్ అనుభవం లభించనుంది.ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని బోటింగ్ సౌకర్యం ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాల్లో కూడా డీజిల్ బోట్ల స్థానంలో సోలార్ బోట్లు ప్రవేశపెట్టే అవకాశముంది. దీంతో పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు పర్యావరణహిత రవాణాకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు – ఏడుగురు అధికారుల సస్పెన్షన్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు