Homeతెలంగాణతెలంగాణలోని విద్యార్థులకు చేపల కూర...!

తెలంగాణలోని విద్యార్థులకు చేపల కూర…!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు చేపలు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కూర ను చేర్చాలని  ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి మత్స్య ఫెడరేషన్‌ కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం విద్యార్థులు ఎంత మంది ఉంటారు.. వారికి ఎన్ని రోజులు చేపల కూర వడ్డించాలి.. ఒక్కొక్కరికి ఎన్ని గ్రాముల చేపలు అవసరం.. పిల్లలందరికీ కలిపి ఎంత మొత్తంలో చేపలు అవసరం అవుతాయి.. ఇందుకు నిధుల సమీకరణ ఎలా అనే అంశంపై అధికారులు లెక్కలు వేస్తున్నట్లు సమాచారం.

ఈ కసరత్తు ఓ కొలిక్కి రాగానే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అనంతరం ప్రభత్వం నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:నటుడు నాగార్జున,అతని కుటుంబానికి క్షమాపణలు-మంత్రి కొండా సురేఖ

Also Read:బ్రేకింగ్ న్యూస్.. డిశ్చార్జ్ అయిన నటుడు ధర్మేంద్ర!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు