Homeక్రీడలువర్షార్పణమైన తొలి టీ20: నిరాశలో క్రికెట్ అభిమానులు

వర్షార్పణమైన తొలి టీ20: నిరాశలో క్రికెట్ అభిమానులు

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆటలో సగం పూర్తయిన తర్వాత వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో క్రికెట్ ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ టీమిండియా బ్యాటర్లు ఈ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచారు.

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.183 తగ్గింపు!

ఆగని వర్షం.. రద్దయిన మ్యాచ్:- భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం ప్రారంభమైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడం, మైదానం చిత్తడిగా మారడంతో ఇక మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాదని అంపైర్లు నిర్ణయించారు. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంగ్లండ్‌లోని చెస్టర్-లీ-స్ట్రీట్ మైదానంలో భారత్ ఆడిన గత మూడు మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగానే రద్దు కావడం గమనార్హం. 2002లో వన్డే, 2011లో వన్డే, ఇప్పుడు 2026లో టీ20 మ్యాచ్.. ఇలా ఈ వేదికపై భారత మ్యాచ్‌లకు వరుణుడి అడ్డంకి ఆనవాయితీగా మారింది. తొలి మ్యాచ్ రద్దు కావడంతో, ఇప్పుడు అందరి దృష్టీ రెండో టీ20పై పడింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా వరుణుడు కరుణిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

New Public Safety Bill: విచారణ లేకుండానే ఏడాది జైలు.. బెంగాల్ ప్రభుత్వం సంచలన చట్టం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు