HomeజాతీయంLPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.183 తగ్గింపు!

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.183 తగ్గింపు!

హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్‌తో పాటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వినియోగించే వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.183 మేర తగ్గించింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

తాజా నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా హోటళ్లు, ఫుడ్ సెంటర్లు, బేకరీలు, క్యాటరింగ్ సంస్థలు, టీ స్టాల్స్ వంటి వ్యాపారాలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఎక్కువగా ఉపయోగిస్తాయి. ధర తగ్గడంతో వారి నిర్వహణ ఖర్చులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది.

ధరల సవరణ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,930కు చేరింది. ఇంతకుముందు ఈ సిలిండర్ ధర రూ.3,113గా ఉండేది. ఒక్కసారిగా రూ.183 తగ్గడంతో వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. అయితే ప్రతి రాష్ట్రంలో అమలులో ఉన్న స్థానిక పన్నులు (వ్యాట్) భిన్నంగా ఉండటంతో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఈ ధరల తగ్గింపు కేవలం 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌కే వర్తిస్తుంది. గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు చేయలేదు. అందువల్ల గృహ వినియోగదారులకు ఈ నిర్ణయం ప్రభావం చూపదు. కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం వల్ల వ్యాపారాల నిర్వహణ వ్యయం కొంత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ధరలనా స్వల్ప ప్రభావం ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు