Saturday, March 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఎఫైర్ అంటగట్టారని.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం!

ఎఫైర్ అంటగట్టారని.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం!

నెల్లూరు జిల్లాలోని సీతారామపురం పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్టేషన్‌లోనే ఈ ఘటన జరగడం, పోలీస్‌ విభాగంలో అంతర్గత వ్యవహారాలపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం విధుల సమయంలోనే కానిస్టేబుల్‌ నల్లిపోగు జ్యోతి నిద్రమాత్రలు మింగినట్టు సహచరులు గుర్తించగా, పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను వింజమూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు.

చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న జ్యోతి మీడియాతో మాట్లాడారు. తన ఆత్మహత్యాయత్నానికి కారణం ఉదయగిరి సీఐ వెంకటరావు వేధింపులేనని ఆమె ఆరోపించారు. మూడేళ్లుగా సీతారామపురం పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తనపై కావాలని అసత్య ఆరోపణలు చేసి మానసికంగా హింసించారని చెప్పారు. స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న శివకృష్ణారెడ్డితో తనకు వివాహేతర సంబంధం ఉందంటూ సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, తన పరువు తీసే ఉద్దేశంతోనే ఇలాంటి ఫిర్యాదులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని జ్యోతి తెలిపారు. విధుల్లో భాగంగా ఎదురయ్యే ఒత్తిడికి తోడు, ఉన్నతాధికారి నుంచి వేధింపులు తట్టుకోలేక ఈ అతి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు, ఇలాంటి చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. తన విషయంలో న్యాయం జరగకపోతే మరిన్ని మహిళా సిబ్బందికీ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సీఐపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను జ్యోతి కోరారు. పోలీస్‌ శాఖలోని క్రమశిక్షణ, పని వాతావరణంపై ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. మహిళా సిబ్బంది భద్రత, గౌరవంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

ALSO READ: Shocking: భార్య ప్రైవేట్ పార్టులో కర్ర గుచ్చి.. ఆపై?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments