Homeతెలంగాణకల్వకుర్తిలో యూరియా కోసం రైతుల ధర్నా

కల్వకుర్తిలో యూరియా కోసం రైతుల ధర్నా

•యాప్ లో బుకింగ్ తో ఇబ్బందులు అవుతున్నాయని ఆవేదన

క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు.. యాప్ లో బుకింగ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటకాలం దాటిపోతోందని.. యూరియా అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. యాప్ లో ఆన్ లైన్ లో కాకుండా పాత పద్ధతిలోనే అడిగిన ప్రతి రైతుకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. సుమారు గంటకు పైగా రైతులు రోడ్డుపై కూర్చోవడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సిఐ నాగార్జున అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు.

Kalvakuntla kavitha: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన.. కాంగ్రెస్ పాలనపై కవిత విమర్శలు

పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు