Homeఆంధ్ర ప్రదేశ్కేటీఆర్ నోట చంద్రబాబు మాట...!

కేటీఆర్ నోట చంద్రబాబు మాట…!

  • గొప్ప సీఎం అంటూ పొగడ్త..!

  • గతంలో సిబిఎన్ అరెస్టు సమయంలో భిన్న స్వరం..!

  • తెలంగాణలో పరిస్థితులతో యూటర్న్..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కేటీఆర్ వ్యూహం మార్చారా? కమ్మ సామాజిక వర్గం పై ఫోకస్ పెట్టారా? అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దోస్తీకి ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబును గొప్ప ముఖ్యమంత్రిగా పొగడ్త వెనుక కారణం అదేనా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ అంటేనే వ్యతిరేకత కనబరిచే కేటీఆర్ లో ఈ మార్పు వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది.

స్పష్టమైన మార్పు..
ఇటీవల కేటీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ.. ముందుకు సాగుతామని ఆయన చెప్పిన తీరు చూస్తుంటే మాత్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విషయంలో గతం మాదిరిగా వ్యవహరిస్తే తెలంగాణలో ఇబ్బందులు తప్పవని కేటీఆర్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే టిడిపి విషయంలో గతం గతః అన్నట్టు ముగించాలని భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేసిన క్రమంలో.. గొప్ప ముఖ్యమంత్రులుగా నందమూరి తారక రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కెసిఆర్లను అభివర్ణించారు. తద్వారా చంద్రబాబు విషయంలో కేటీఆర్ బాగా తగ్గినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్టు సమయంలో..
2023 సెప్టెంబర్ లో అరెస్ట్ అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో తెలంగాణలో కెసిఆర్ పార్టీ అధికారంలో ఉంది. అయితే హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు నిర్వహిస్తామంటే ఇదే కేటీఆర్ కుదరదని తేల్చి చెప్పారు. ఏపీలో అరెస్టులకు తెలంగాణతో సంబంధం ఏంటని అనుచితంగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ సైతం చంద్రబాబు విషయంలో చాలా చులకనగా ఉండేవారు. కనీసం ఆ అరెస్టుపై స్పందించిన దాఖలాలు కూడా లేవు. పైగా 2018లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేకపోయారు కేసీఆర్. అందుకే 2019లో రిటర్న్ గిఫ్ట్ పేరిట జగన్మోహన్ రెడ్డికి చాలా విధాలుగా సాయం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి.. ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచేసరికి చంద్రబాబు విషయంలో గులాబీ దండు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా తెలంగాణలో పోటీ నుంచి తప్పుకున్నారు చంద్రబాబు. అలా టిడిపి క్యాడర్ గులాబీ పార్టీపై ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచింది. దాని పర్యవసానాలే 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి. 2024 నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం. అందుకే ఇప్పుడు కేటీఆర్ గుణపాఠాలు నేర్చుకున్నట్టు ఉన్నారు. టిడిపి విషయంలో జరిగిన తప్పిదాన్ని సరి చేసుకునే పనిలో పడ్డారు.

కవిత తీరుతో..
తెలుగుదేశం పార్టీ విషయంలో కేటీఆర్ వ్యవహార శైలి మారడానికి సోదరి కవిత ఒక కారణం. కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. బీసీ నినాదంతో ఆమె తెలుగుదేశం పార్టీ క్యాడర్ పై గురిపెట్టినట్టు కనిపిస్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆమె వైపు మొగ్గుచూపితే మాత్రం భారత రాష్ట్ర సమితి అస్తిత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కేటీఆర్ వ్యూహం మార్చినట్లు స్పష్టం అవుతోంది తెలుగుదేశం పార్టీ విషయంలో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు