Homeతెలంగాణహుస్నాబాద్‌లో జోరందుకున్న ప్ర‌చారం

హుస్నాబాద్‌లో జోరందుకున్న ప్ర‌చారం

  • అప్యాయంగా ప‌ల‌కిస్తూ ఇంటింటా ప్ర‌చారం
  • సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్దిపై వివ‌ర‌ణ‌

హుస్నాబాద్‌, క్రైం మిర్ర‌ర్ః

హుస్నాబాద్ మున్సిపాలిటిలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం జోరందు కుంది.మున్సిపాలిటి 5వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి బొలిశెట్టి రాజుకు మ‌ద్ద‌తుగా మంత్రి పొన్నం ప్ర‌భాకర్ విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు.

భారీ ర్యాలితో కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు.

మ‌హిళ‌ల‌ను, వృద్దుల‌ను అప్యాయ ప‌ల‌క‌రిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు.

ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హుస్నాబాద్ ప‌ట్ట‌ణంను ప్రత్యేక ప్ర‌ణాళిక‌తో అభివృద్దిలో ముందు నిలుపుతాన‌న్నారు.

20 స్థానాలు గెలిస్తే అభివృద్దిలో అగ్రగామిగా నిలుపుతాన‌న్నారు ఈ కార్య‌క్రంలో నాయకులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు