గుజరాత్‌లోని సూరత్‌లో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 14 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె సవతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కొంతకాలంగా బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలిక ఏడు నెలల గర్భిణిగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
అనంతరం బాలికను తల్లి ప్రశ్నించడంతో ఘటనకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. తన సవతి తండ్రి గత కొన్ని నెలలుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాలిక వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిందితుడు బెదిరించినట్లు బాలిక తన తల్లికి చెప్పినట్లు సమాచారం.
దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలికకు అవసరమైన వైద్య, మానసిక సహాయం అందించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
also read: 20 రోజులుగా ఆర్మీ జవాన్ అదృశ్యం.. బెంగళూరు స్టేషన్‌లో ఐడీ కార్డు లభ్యం
