-
బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి
నకిరేకల్, క్రైమ్మిర్రర్: బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ ఎస్ శ్రేణులు కేంద్ర హోంశాక సహాయ మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు బండి భగిరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ ఎస్ నాయకులు వారి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నకిరేకల్‌లో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తప్పు చేసిన తన కుమారుడిని రక్షించేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నాడని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేంతవరకూ బీఆర్‌ఎస్‌వీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్శిటీ ఇన్‌ఛార్జి గాదె శివ, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు చింతమళ్ల వెంకటేశ్, కందికంటి నాగేంద్రబాబు, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు జిల్లా సంపత్ కుమార్, నియోజకవర్గ నాయకులు జిల్లా సందీప్, మండల నాయకులు యాతాకుల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు