Homeక్రైమ్బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్...! ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేయాల‌ని డీజీపీకి ఆదేశం...

బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్…! ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేయాల‌ని డీజీపీకి ఆదేశం…

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితీవ్రంగా స్పందించారు. కేసు దర్యాప్తును వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర డీజీపీ సివి అనంద్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మే 8న ఫిర్యాదు అందినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ప్రశ్నించినట్లు సమాచారం. కేసు పురోగతిపై పూర్తి వివరాలను డీజీపీ సీఎంకు నివేదించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన కారణంగా పోలీసు సిబ్బంది మొత్తం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని డీజీపీ వివరించారు.

దీంతో కేసు విచారణలో కొంత ఆలస్యం జరిగిందని ఆయన తెలిపారు. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని సీఎం, కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను (SIT తరహాలో) ఏర్పాటు చేయాలని సీఎం డీజీపీకి సూచించారు. విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.బండి భగీరథ్ కేసుపై సీఎం నేరుగా జోక్యం చేసుకోవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు