Homeతెలంగాణతెలంగాణలో సైబర్ నేరాలపై పోలీసుల ఫోకస్...!

తెలంగాణలో సైబర్ నేరాలపై పోలీసుల ఫోకస్…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్‌: తెలంగాణలో సైబర్ నేరాలపై పోలీసులు దృష్టి సారించగా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతం సైబర్ మోసాలకు కీలక లింక్‌గా మారినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి, పెనుబల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసుల్లో నిందితులు దేశీయులతో పాటు విదేశీయులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు సుమారు 55 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వందల కోట్ల సైబర్ మోసాలు…

Also Read:ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర‌ విషాదం….! ఉరి వేసుకొని బాలింత ఆత్మ‌హ‌త్య‌…

ఈ ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చిన ఓ భారీ సైబర్ మోసం కేసు దర్యాప్తులో సుమారు రూ.570 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు విస్తరించేకొద్దీ ఈ వ్యవహారానికి సంబంధించిన మోసాల విలువ రూ.1,000 కోట్లకు మించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

ఆస్ట్రేలియన్లను టార్గెట్ చేసిన కాల్ సెంటర్…

Also Read:ఢిల్లీకి హైఅలర్ట్.. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల

తాజాగా హైదరాబాద్‌లో నమోదైన మరో కేసులో సత్తుపల్లి ప్రాంతానికి చెందిన దేవరపల్లి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తులను మోసం చేసి రూ.100 కోట్ల వరకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేసు నమోదు కావడంతో విదేశాలకు వెళ్లిపోయిన పట్టాభి.. ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మ్యాట్రిమోనీ నుంచి క్రిప్టో వరకు…

Also Read:రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. మృతదేహాన్ని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లిన ట్రైన్

సైబర్ నేరగాళ్లు మోసాలకు అనేక మార్గాలను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనీ పరిచయాలు, రివార్డ్ పాయింట్లు, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ వంటి అంశాలను అడ్డుపెట్టుకుని బాధితులను నమ్మించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లోకి చేర్చి పెట్టుబడుల పేరుతో డబ్బులు బదిలీ చేయించడంతో పాటు, నకిలీ లింకులు, APK ఫైల్స్ పంపి బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మోసపూరితంగా వచ్చిన డబ్బును మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా తరలించి, అనంతరం క్రిప్టోకరెన్సీ లేదా విదేశీ కరెన్సీగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది.

విదేశాల్లోనూ కాల్ సెంటర్లు…

Also Read:విద్యుత్ పోల్‌ అమర్చుతుండగా విషాదం.. 5 సెకన్లలోనే కార్మికుడి మృతి

ఈ సైబర్ మోసాలకు సంబంధించిన నెట్‌వర్క్ కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కంబోడియా వంటి దేశాల్లోనూ కాల్ సెంటర్లను నిర్వహించి విదేశీ బాధితులను సంప్రదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన వ్యక్తులు కూడా బాధితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సైబర్ డబ్బుతో భారీగా జల్సాలు…

Also Read:SCCLలో 300 అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు.. నెలకు రూ.12,300 వరకు స్టైపెండ్‌!

మోసాల ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలను నిందితులు విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేసినట్లు దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్ ప్రయాణాలు, భూముల కొనుగోళ్లు వంటి వాటికి డబ్బును వినియోగించినట్లు పోలీసులు గుర్తించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కొందరు నిందితులు కుటుంబ సభ్యులు, బినామీల పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్లు కూడా అనుమానిస్తున్నారు.

మరిన్ని కేసులపై దర్యాప్తు…

Also Read:ఆగస్టు 14న ‘పాంచాలి పంచభర్తృక’.. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యమంటున్న రాజేంద్ర ప్రసాద్

సత్తుపల్లి, పెనుబల్లి ప్రాంతాల్లో నమోదైన సైబర్ నేరాల వెనుక ఒకే తరహా నెట్‌వర్క్ పనిచేస్తుందా? ఇంకా ఎంతమంది ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నేరాల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పలు కేసులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో మరింత లోతుగా విచారిస్తున్నారు.సత్తుపల్లి కేంద్రంగా వెలుగులోకి వస్తున్న వరుస సైబర్ మోసాలు తెలంగాణ పోలీసులకు కొత్త సవాల్‌గా మారాయి. ముఖ్యంగా విదేశీ బాధితులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ నిర్వహించినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు