Homeక్రైమ్ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర‌ విషాదం....! ఉరి వేసుకొని బాలింత ఆత్మ‌హ‌త్య‌...

ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర‌ విషాదం….! ఉరి వేసుకొని బాలింత ఆత్మ‌హ‌త్య‌…

న‌ల్ల‌గొండ‌,క్రైమ్‌మిర్ర‌ర్‌:నల్లగొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది..ఆస్పత్రి ప్రాంగణంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న బాలింత ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) ప్రసవం నిమిత్తం ఎనిమిది రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చిన మమత, ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Also Read:విద్యుత్ పోల్‌ అమర్చుతుండగా విషాదం.. 5 సెకన్లలోనే కార్మికుడి మృతి

స్థానికులు గమనించి ఆసుపత్రి సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రసవం జరిగిన కొద్ది రోజులకే మమత ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు భిన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు ఆసుపత్రిలో జరిగిన పరిణామాలపై విచారణ జరుపుతున్నారు.పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి.

Also Read:యువ దర్శకులకు అండగా అన్నపూర్ణ స్టూడియోస్.. నాగార్జున కీలక వ్యాఖ్యలు

తాజావార్తలు