HomeUncategorizedఏలూరులో దారుణం...సుపారీ గ్యాంగ్ తో భ‌ర్త‌ను హ‌త్య చేయించిన భార్య‌...! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం...

ఏలూరులో దారుణం…సుపారీ గ్యాంగ్ తో భ‌ర్త‌ను హ‌త్య చేయించిన భార్య‌…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…

ఏలూరు, క్రైమ్ మిర్ర‌ర్‌: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాదని 12 లక్షలు సుపారి ఇచ్చి భర్తను అతి కిరాతకంగా హత్య చేయించింది భార్య. ఏలూరు జిల్లా కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వివ‌రాలు వెల్లడించారు. ఆగిరిపల్లి మండలం, వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సలోమన్ రాజు, రెడ్డి దుర్గామణి భార్యాభర్తలు. గత మూడు సంవత్సరాలుగా

వడ్లమాను సచివాలయంలో పనిచేసిన పలగాని వెంకన్నబాబుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. సదరు విషయం భర్త రెడ్డి సులోమన్ రాజు తెలియడంతో తన భార్యను తరచూ వేధిస్తూ, కొట్టేవాడు. దీంతో దుర్గామణి తన భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు వెంకన్నబాబుతో మాట్లాడి సుమారు రూ.12 లక్షల రూపాయలు సాయి శ్రీనివాస్, జస్వంత్ రాయ్ లతో మాట్లాడి సుపారీ ఇచ్చి సాల్మన్ రాజును హత్య చేయించేందుకు ప్లాన్ చేశారు. గత నెల 17వ తేదీ రాత్రి సులేమాన్‌ రాజును కారులో ఎక్కించుకుని కొండపావులూరు సమీపంలోని జగనన్న ఇళ్ల సముదాయం వద్ద ఎన్డీఆర్‌ఎఫ్‌ గేటు దగ్గరకు తీసుకెళ్లారు.

అక్కడ సులేమాన్‌ మెడకు చార్జింగ్‌ వైరు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే పడేసి, కారులో పరారయ్యారు. ఆగిరిపల్లి పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడిందని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కేసులో భార్య తో పాటు నలుగురు ముద్దాయిలను కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులైన కలతోటి సాయిశ్రీనివాస్‌, మద్దాలి జశ్వంత్‌రాయ్‌,కలతోటి మణికంఠ, పలగాని వెంకన్నబాబు, రెడ్డి దుర్గామణిలను గన్నవరం వద్ద గురువారం అరెస్టు చేశారు. కారు, 5 సెల్‌ఫోన్లు, 5 బీరు సీసాలు, సెల్‌ఫోన్‌ పవర్‌ బ్యాంక్‌ చార్జింగ్‌ కేబుల్‌ వైరు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు