Homeఆంధ్ర ప్రదేశ్డీఎస్సీ పై చర్చిద్దాం రా!.. జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ సవాల్!!

డీఎస్సీ పై చర్చిద్దాం రా!.. జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ సవాల్!!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. ప్రధానంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి సమర్ధించడాన్ని తప్పుపట్టారు. బాగా మాట్లాడావు అని మెచ్చుకోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా నీ భార్య భారతి రెడ్డిని… మీ ఇద్దరి కూతుర్ల గురించి ఎవరైనా మాట్లాడితే.. ఇలానే ఫోన్ చేసి బాగా మాట్లాడావు అని అంటావా అని జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. మహిళల పట్ల వైసిపి నేతలకు ఉన్న సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు.

ఇక్కడ ఉంటే కదా తెలిసేది..

మరోవైపు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలస్కే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తే ఇక్కడి నిజాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు లోకేష్. ఒక ప్రిజనరీకి, రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించే విజనరీ మధ్య చాలా తేడా ఉంటుంది అంటూ సెటైర్ వేశారు. జగన్ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి 100 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటే.. అందులో 20 కోట్లు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కి వస్తున్నాయని గుర్తు చేశారు. ఇండస్ట్రీకి, కోడిగుడ్డుకు కూడా తెలియని వాళ్ళు గతంలో పాలించారని.. ఐదేళ్లపాటు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోగా, ఉన్న పరిశ్రమలను సైతం బెదిరించి తరిమేసారని ఆరోపించారు. మీరా ఈ రాష్ట్రం గురించి మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు లోకేష్.

డీఎస్సీ పై విషప్రచారం..

పారదర్శకంగా డీఎస్సీ 2025 నిర్వహిస్తే దానిపై విషయం చిమ్ముతున్నారు అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నిర్వహణపై జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి కేవలం 200 మీటర్ల దూరంలో నిలబడి సవాల్ విసురుతున్నానని.. దమ్ముంటే డీఎస్సీ అభ్యర్థుల ఎంపికపై నాతో చర్చకు రా అంటూ సవాల్ చేశారు. ప్రతి అంశానికి విద్యాశాఖ ఆధారాలతో సహా పక్కాగా సమాధానం ఇస్తుంటే.. జగన్ మాత్రం తన పాత అలవాటు ప్రకారం అబద్ధాలనే పదేపదే వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. గొడ్డలి పార్టీ లాగా దొంగ చాటుగా బురద చల్లి పారిపోయే రకం కాదని.. డీఎస్సీ పై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు సవాల్ చేశారు. మొత్తానికి అయితే ఇప్పుడు లోకేష్ గట్టిగానే సవాల్ విసరడంతో వైసిపి వెనక్కి తగ్గుతుందా? లేదా? అన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు