Homeక్రైమ్శెట్టిపాలెం ఇండియ‌న్ గ్యాస్ గోదాములో అంతా గోల్ మాల్..!

శెట్టిపాలెం ఇండియ‌న్ గ్యాస్ గోదాములో అంతా గోల్ మాల్..!

  • బుక్ చేసి 15 రోజులు అవుతున్న అంద‌ని వైనం..!

  • ఇచ్ఛలవిడిగా హోటల్స్ కు రెండు మూడు సరఫరా..!

  • ఏంట‌ని ప్ర‌శ్నిస్తే నిర్వాహ‌కుల దురుసు స‌మాధానం..!

  • క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం..!

  • గోదాముకు ఎన్ని క‌నెక్ష‌న్‌లు, బుకింగ్స్ ఎన్ని, సరఫరా ఎన్ని తెలుపాల‌ని డిమాండ్

క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: వంట గ్యాస్ కొర‌త‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌లం గ్రామాల ప్ర‌జ‌లు గ్యాస్ లేక ఒక పూట ప‌స్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేద‌న చెందుతున్నారు. శెట్టిపాలెం ఇండియ‌న్ గ్యాస్ నిర్వాహ‌కులు ఇష్టారీతిన గ్యాస్ విచ్చ‌ల‌విడిగా దొడ్డిదారిన అమ్ముకుంటున్న అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం మమ్ములను ఆవేదనకు గురిచేస్తుందని వాపోతున్నారు. క్రైమ్ మిర్రర్ ప్రతినిధితో వారి యొక్క గోడును, ఆవేదనను చెప్పుకున్నారు. మండ‌లంలోని శెట్టిపాలెం గ్రామంలోని ఇండియ‌న్ గ్యాస్ ఏజెన్సీ ద్వ‌రా చుట్టుప‌క్క‌ల గ్రామాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంటారు. కాని గ్యాస్ బుక్ చేసి 15 రోజులు గ‌డిచిన డెలీవ‌రి చేయ‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. ఎందుకు డెలీవ‌రి చెయ్యడం లేదు ఏంట‌ని ప్ర‌శ్నిస్తే మా ద‌గ్గ‌ర లేవు మా ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండంటూ దురుసుగా స‌మాధానం చెబుతున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. అంతే కాకా మా క‌ళ్ల‌ముంద‌నే హోట‌ళ్ల‌కు విచ్చ‌ల‌విడిగా త‌ర‌లిస్తున్నార‌ని ఆవేద‌న చెందారు. గ్యాస్ లేక ఒక పూట వంట‌చేసుకోవ‌డం గ‌గ‌న‌మ‌వుతుంద‌ని ఒక పూట ప‌స్తులుండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఆవేద‌న చెందుతున్నారు. హోట‌ళ్ల‌కు వాణిజ్య సిలిండ‌ర్‌లు అందించాల్సి ఉండ‌గా వారికి ఎక్కువ రేట్ల‌కు విక్ర‌యిస్తూ సొమ్ముచేసుకుంటు ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులకు గురి చే్స్తున్నార‌ని ఆవేద‌న చెందుతున్నారు.

శెట్టిపాలెం ఇండియ‌న్ గ్యాస్ గోదాములో అంతా గోల్ మాల్..!
శెట్టిపాలెం ఇండియ‌న్ గ్యాస్ గోదాములో అంతా గోల్ మాల్..!

గ్యాస్ గురించి అడిగితే దిక్కు ఉన్న కాడ చెప్పుకో…

గ్యాస్ కోసం బుక్ చేసి 15 నుంచి 20 రోజులు గ‌డుస్తున్న గ్యాస్ డెలీవ‌రి చేయ‌డం లేదు. దీంతో వినియోగ‌దారులు ఇండియ‌న్ గ్యాస్ నిర్వాహ‌కుల‌ను అడిగితే డెలివరీ మేము చెయ్యము డెలివరీ చెయ్యడం వద్దు అన్నారు మా అధికారులు మిరే ఏజెన్సీ వ‌ద్ద‌కు రండి అంటూ చెబుతున్నారు. తీరా గోదాం వ‌ద్ద‌కు వెళ్లి అడితే పొంత‌న‌లేని స‌మాధానం చెప్తున్నారు,..ఏంట‌ని ప్ర‌శ్నిస్తే మా ద‌గ్గ‌ర లేవు… ఏం చేసుకుంటారో చేసుకోండంటూ దురుసుగా స‌మాధానం చెబుతున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. మా క‌ళ్ల‌ముంద‌నే హోట‌ళ్ల‌కు విచ్చ‌ల‌విడిగా త‌ర‌లిస్తున్నార‌ని ఆవేద‌న చెందారు. గ్యాస్ లేక క‌డుపుకు స‌రైన వంట కూడ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాపోయారు. నిర్ల‌క్ష్య‌మైన స‌మాధానాలు చెబుతూ దొంగ‌చాటున గ్యాస్ సిలిండ్‌ర్లు ఎక్క‌వు ధ‌ర‌కు విక్ర‌యిస్తున్న శెట్టిపాలెం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. అంతేగాకుండా గోదాముకు ఇండియ‌న్ గ్యాస్ క‌నెక్ష‌న్‌లు ఎన్ని ఉన్నాయి… ఎన్ని బుక్ అవుతున్నాయి…ఎన్ని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు… అన్న వివ‌రాలు తెలుపాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.

శెట్టిపాలెం ఇండియ‌న్ గ్యాస్ గోదాములో అంతా గోల్ మాల్..!
శెట్టిపాలెం ఇండియ‌న్ గ్యాస్ గోదాములో అంతా గోల్ మాల్..!

కొట్ట‌చ్చిన‌ట్లు అధికారుల నిర్ల‌క్ష్యం…

వేముల‌ప‌ల్లి మండ‌లంలోని ప్ర‌జ‌లు గ్యాస్ కొర‌త‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నా ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడ‌ని పేర్కొంటున్నారు. శెట్టిపాలెం ఇండియ‌న్ గ్యాస్ నిర్వాహ‌కులు ఇష్టారీతిన గ్యాస్ విచ్చ‌ల‌విడిగా దొడ్డిదారిన అమ్ముకుంటున్న అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం శోచ‌నీయం. గ్యాస్ గోదాములో ఇంతా గోల్ మాల్ జ‌రుగుతున్న అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప‌లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాణిజ్య సిలిండ‌ర్‌లు హోట‌ళ్ల‌కు స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉండ‌గా వంట గ్యాస్ సిలిండ‌ర్‌ల‌ను విక్ర‌యిస్తున్న అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. కాసుల‌కు క‌క్కుర్తి ప‌డి మామూళ్ల మోజులో ప‌ట్టించుకుంట‌లేర‌నే విమ‌ర్శ‌లు వెల్ల‌వెత్తుతున్నాయి. ఏదేమైన అక్ర‌మ గ్యాస్ డెలీవ‌రీ దందాను అరిక‌ట్టి పేద‌ల‌కు వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని ప్ర‌జ‌లు అధికారుల‌ను కోరుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు