విశాఖపట్నంలోని పాత గాజువాక ప్రాంతంలో ముగ్గురు అన్నదమ్ములు కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కైలాస్నగర్కు చెందిన రాఘవేంద్రరావు, అశ్విని దంపతుల మధ్య విభేదాలు రావడంతో వారు విడిగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ముగ్గురు కుమారులు గాజువాకలోని తమ మామ సోమలింగ వద్ద ఉంటున్నారు.
అయితే ఇటీవల ఇంట్లో ఎవరికి తెలియకుండా పెద్ద కుమారుడు హర్షిత్ (18), రోహన్ (14), చిన్నవాడు సాహిల్ (11) అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయారు. ఇంటి నుంచి వెళ్లిన తర్వాత వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా వారు తమ మొబైల్ ఫోన్ను కూడా ఇంట్లోనే వదిలి వెళ్లడం మరింత అనుమానాలకు దారితీసింది.
అదే కాకుండా, వారి వ్యక్తిగత వస్తువులు, దుస్తులు, ఆధార్ కార్డులు, విద్యాసంబంధిత పత్రాలు కూడా ఇంట్లో కనిపించకపోవడం గమనార్హం. ఈ పరిణామంతో అప్రమత్తమైన సోమలింగ వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ, వారి కదలికలను ట్రేస్ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏదైనా సమాచారం తెలిసిన వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.
also read: “నాకు ప్రాణహానీ ఉంది”- పోలీసులను ఆశ్రయించిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా