Homeక్రైమ్డాడీ లేని జీవితం నాకొద్దంటూ...ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌...!

డాడీ లేని జీవితం నాకొద్దంటూ…ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: అల్లారు ముద్దుగా పెంచిన ఆక‌స్మ‌త్తుగా చ‌ని పోవ‌డంతో ఆ అమ్మాయి మాన‌సికంగా క్రుంగి పోయింది. డాడీ లేని బాధ‌ను త‌ట్టుకోలేక చివ‌రికి కుమార్తే ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడకు చెందిన చెన్నకేశవులు కుమార్తె పి. జ్ఞానశ్రీ(21) మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. మైసమ్మగూడలోని ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. కాగా మార్చి 31న తండ్రి చెన్నకేశవులు మృతి చెందడంతో సొంతూరుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొంది.

రెండు రోజుల క్రిత‌మే హాస్ట‌ల్‌కు…

తండ్రి అంత్య‌క్రియ‌లు పూర్తి చేసి రెండు రోజుల క్రితం కాలేజీకి వచ్చి హాస్టల్‌లో ఉంటోంది. బుధవారం కాలేజీలో పరీక్ష రాసిన జ్ఞాన శ్రీ.. గురువారం పరీక్షకు హాజరు కాకుండా హాస్టల్‌లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన ఆమె స్నేహితరాళ్లు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జ్ఞానశ్రీ చేతిలో సుసైడ్ నోట్‌ లభించింది. ‘డాడీ లేని జీవితం ఊహించలేను’ అంటూ లేఖలో పేర్కొంది. తన తమ్ముడిని తాత వద్ద ఉండమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు