బాలీవుడ్‌లో మరోసారి సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. యువ నటిపై లైంగిక దాడి, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత షకీల్ నూరానీను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు, కొంతకాలంగా కనిపించకుండా ఉన్న నిందితుడిని మహాబలేశ్వర్ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పట్టుకున్నారు. సుమారు 40 రోజులుగా అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, నాలుగేళ్ల క్రితం మత్తు పదార్థం కలిపిన పానీయం ఇచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ ఘటనను వీడియో రూపంలో చిత్రీకరించి, దాన్ని చూపిస్తూ పలుమార్లు బెదిరింపులకు గురిచేసి, మరికొన్ని సార్లు దాడి చేసినట్లు తెలిపింది.
ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం కోర్టులో హాజరుపరిచిన తర్వాత, న్యాయస్థానం ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై సినీ పరిశ్రమలో చర్చ మొదలైంది. బాధితులకు న్యాయం జరగాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
also read: వ్యక్తిపై కత్తితో దాడి – సీసీటీవీలో రికార్డ్, నిందితుడి కోసం గాలింపు
