Homeక్రైమ్మంచం పై నోట్ల కట్టలు... కంగుతిన్న ఏసీబీ...!

మంచం పై నోట్ల కట్టలు… కంగుతిన్న ఏసీబీ…!

  • మరో వందల కోట్ల తిమింగలం పట్టివేత

  • ఏసీబీకి చిక్కిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకర నరహరి

  • భారీగా నగదు, కేజీల కింద బంగారం స్వాధీనం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: అవినీతి అధికారులకు అంతే లేకుండా పోయింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో అవినీతి తిమింగలాలు ఏసీబీకి పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ల్యాండ్ సెండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకర నరహరి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని పక్కా సమాచారంతో ఏసీబీ ప్రత్యేక బృందాలు మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో దాడులు ప్రారంభించాయి.

Also Read: Breaking News: తెలంగాణకు నేడు పవన్ కళ్యాణ్…! – Crime Mirror

హైదరాబాద్ పాతబస్తీలోని ఆయన నివాసంలో సోదాలు చేశారు. ఏసీబీ అధికారులకు తవ్వే కొద్ది అక్రమ ఆస్తుల నిధులు బయటపడుతుండడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఛత్రినాకలోని నరహరి ప్రధాన నివాసం తో పాటు ఆయనకు సంబంధించిన బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లోనూ ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు కొనసాగాయి.

  • నోట్ల కట్టలపై పరుపు వేసి..

ఈ తనిఖీల్లో భారీగా నగదు, కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చివరకు ఆయన పడుకునే మంచం మొత్తం నోట్ల కట్టలు పరిచారు. దానిపై పరుపు వేసి దానిమీద పడుకుంటున్నారు. ఈ నోట్ల కట్టల విలువ కోట్లలో ఉండే అవకాశం ఉండడంతో లెక్కింపు కోసం ప్రత్యేక మిషన్లను రంగంలోకి దించారు.

ACB raids ల్యాండ్ సెంట్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకర నరహరి
ACB raids ల్యాండ్ సెంట్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకర నరహరి

కేవలం నగదు, బంగారమే కాకుండా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అత్యంత ఖరీదైన ల్యాండ్ ప్లాట్ లకు సంబంధించిన కీలక భూమి పత్రాలను సైతం ఏసీబీ అధికారులు గుర్తించారు.

  • అధికార హోదాను అడ్డం పెట్టుకొని..

అవినీతి అధికారి నరహరి సర్వే డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న అధికారిక హోదా అడ్డం పెట్టుకొని.. రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తూ భారీగా భూములు వెనుకేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు స్వాధీనం చేసుకున్న పలు రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Also Read: గ్రేటర్ కు దూరంగా బండి సంజయ్…! – Crime Mirror

ప్రభుత్వ సర్వీసులో ఉంటూ అక్రమ మార్గాల్లో వందల కోట్ల రూపాయల మేర ఆస్తులు కూడా పెట్టినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన ఏసీబీ.. నరహరి బినామీల నెట్వర్క్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. మంగళవారం రోజంతా ఈ తనిఖీలు కొనసాగాయి.

ఇవి ముగిసే సరికి మరిన్ని విస్తు పోయే నిజాలు, భారీగా అక్రమ ఆస్తుల వివరాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో వరుసగా వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులతో అవినీతి అధికారులు పట్టుబడుతుండడం మాత్రం సంచలనంగా మారుతుంది.

Also Read: ఇండియన్ థియేటర్ల ముందు యూరప్ థియేటర్లు ఫెయిల్ ? – Crime Mirror

Also Read: ఏపీకి కేంద్రం నుంచి మరో ప్రాజెక్టు.. ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ మంజూరు – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు